
మెదక్ టౌన్, వెలుగు: జాతీయ ఫుట్బాల్ పోటీలకు మెదక్ జిల్లా తరఫున శరత్చంద్ర, హసన్ ఎంపికయ్యారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మార్చి 14 నుంచి 16 వరకు వనపర్తిలో జరిగిన 14 ఏండ్లలోపు బాలుర రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెదక్ జిల్లా నుంచి ఈ ఇద్దరు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
ఈనెల 25 నుంచి 29 వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో మన రాష్ట్రం తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్నారు. శరత్చంద్ర రామాయంపేట పట్టణానికి చెందిన వాడు కాగా, హసన్ మెదక్ పట్టణానికి చెందినవాడు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ తీసుకొని మెదక్ స్టేడియంలో ఫుట్బాల్ సెంటర్ ను మంజూరు చేస్తే జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు.