
- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
నిజాంపేట, వెలుగు : పంట నష్టం జరిగిన రైతులు అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం నిజాంపేట మండలంలోని జెడ్ చెరు గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ..
పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలో సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారుతి, ముత్యం రెడ్డి, రమేశ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.