పాపన్నపేట, వెలుగు : మండలంలోని కొత్తపల్లిలో మూడు రోజులుగా అనంత పద్మనాభ స్వామి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం కల్యాణం నిర్వహించగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలోని తమ్మయపల్లిలో నిర్వహిస్తున్న మల్లన్న కల్యాణోత్సవం లో పాల్గొన్నారు.
అక్కడి నుంచి డాక్యతాండలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎంపీటీసీ మౌనిక రాజును పరామర్శించారు. అనంతరం పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవింద నాయక్ , డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్, పాపన్నపేట ఎంపీటీసీ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు