- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
జీడిమెట్ల, వెలుగు : దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీని దేహద్రోహి అనడంపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. గురువారం దూలపల్లిలోని తన ఇంట్లో రోహిత్ మీడియాతో మాట్లాడారు. గాంధీపై తీవ్ర వాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవినీత్సింగ్బిట్టూ
మాజీ ఎమ్మెల్యే ధార్ విందర్ సింగ్మార్వాను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. రాహుల్‌గాంధీని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానేసి ప్రజా సేవ చేయాలని హితవు పలికారు.