
మెదక్ టౌన్, వెలుగు: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీ ఘనపూర్ మండల పరిధిలోని రాజిపేట శివారులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామ శివారులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈత మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవించేవారిని గత పాలకులు విస్మరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వారి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. గీత కార్మికులకు పింఛన్ మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. స్వచ్ఛమైన కల్లును అందించడానికి ఈత వనాలను పెంచుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్చైర్పర్సన్లావణ్య, రాజిపేట సర్పంచ్ సరిత సాయాగౌడ్, ఎంపీటీసీలు స్వప్న దుర్గా రావు, జ్యోతి సిద్ధిరెడ్డి, వాడి సర్పంచ్ యామి రెడ్డి, నాయకులు భిక్షపతి రెడ్డి, పాండురంగారావు, బాబాగౌడ్, నారాగౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.