సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు : ఎమ్మెల్యే రోహిత్​రావు

సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్, వెలుగు: సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శనివారం మెదక్​ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం మీతోనే ఉంటానన్నారు.  కలెక్టరేట్ లో ఎస్సీ కార్పొరేషన్ కింద  కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్దిదారులకు సర్టిఫికెట్లతో పాటు  కుట్టుమిషన్లను అందజేశారు.

 పట్టణంలో రాందాస్ చౌరస్తాతో పాటు మున్సిపల్ ఆఫీసులో చలివేంద్రాలను ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన మ్యాకల సరోజన భర్త రవీందర్​కు రూ. 82 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్, వెంకటరమణ, ఆంజనేయులు గౌడ్, మధుసూదన్ రావు, రాజలింగం, శేఖర్, లక్ష్మీనారాయణ, లక్ష్మీ, శ్రీనివాస్​చౌదరి, దుర్గాప్రసాద్, నిఖిల్, రమేశ్, ప్రభాకర్, ప్రవీణ్, భూపతి, మహిపాల్, రాజలింగం, భరత్ గౌడ్, ఉమర్ పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అభివృద్ధి

దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ఆలయాల నిర్వహణ పేరుతో ప్రైవేట్​వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉత్సవాల నిర్వహణకు భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తూ ఆలయాలకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ల అద్దెల ద్వారా సమకూరుతున్న లక్షల రూపాయల ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండు ఆలయాల వ్యవహారంపై ఎండోమెంట్ అధికారులు సమగ్ర విచారణ జరుపుతారు చెప్పారు. విచారణ అనంతరం ప్రభుత్వ పరంగా  తగు చర్యలు తీసుకుంటామన్నారు.