గాంధీ ఆస్పత్రిలో ఘటని రాజు

గాంధీ ఆస్పత్రిలో ఘటని రాజు

వార్డు లోపలికి ఎవరినీ అనుమతించని పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక సెగ్మెంట్ బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు ఘటని రాజును ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకుని కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, గాయపడ్డ రాజును పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటున్నాడు. ఎమర్జెన్సీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్​లో ఉన్న రాజు హెల్త్ కండీషన్ బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దుబ్బాక పోలీసులతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది ఎమర్జెన్సీ వార్డు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజు ఉన్న వార్డు లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఎమర్జెన్సీ బ్లాక్‌‌లోని 6 వ ఫ్లోర్‌‌‌‌లో రాజుకు ట్రీట్​మెంట్ ఇవ్వాల్సి ఉండగా, భద్రతా కారణాల దృష్ట్యా  2వ ఫ్లోర్‌‌‌‌లోని​ఆర్​ఐసీయూలో ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.