- సీఎంకు వినతిపత్రం సమర్పించిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలో ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీకి అవసరమైన భూమితో పాటు నిధులు కేటాయించాలని ఎంపీ రఘునందన్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అంజేశారు. మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ సొంత భవనం నిర్మాణానికి 20 ఎకరాల భూమి అవసరం ఉంటుందని వీలైనంత త్వరగా కేటాయించాలన్నారు.
ప్రజారోగ్యం, విద్యను మెరుగుపరచడంలో ఒక మైలురాయిగా పనిచేస్తుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు జిల్లా ఇన్ చార్జి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.