మెదక్ మున్సిపల్ ​మీటింగ్ ​రసాభాస

మెదక్ మున్సిపల్ ​మీటింగ్ ​రసాభాస
  •     చైర్మన్, వైస్​ చైర్మన్ల మధ్య గొడవ  

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ మున్సిపల్​జనరల్​బాడీ మీటింగ్​రసాభాసగా మారింది. శనివారం చైర్మన్​ చంద్రపాల్​అధ్యక్షతన సమావేశం నిర్వహించగా సభ్యులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్​ వివరాలన్నీ ఎజెండాలో పెట్టాలని వైస్​ చైర్మన్​మల్లికార్జున్​గౌడ్​ కమిషనర్​జానకీరామ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్​ చంద్రపాల్​ జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగేలా ప్రయత్నించారు. 

కానీ వైస్​ చైర్మన్​మల్లికార్జున్​గౌడ్ ఆమ్యామ్యాలు ఇస్తేనే పని చేస్తారని చైర్మన్ ను ఉద్ధేశించి అనడంతో  ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో వైస్​చైర్మన్​మల్లికార్జున్​ఆగ్రహంతో వేదికపై నుంచి వచ్చి కింద తోటి కౌన్సిలర్లతో కూర్చున్నారు. అనంతరం చైర్మన్​ చంద్రపాల్​వైస్​చైర్మన్​ను వేదికపైకి రావాలని పిలవడంతో మల్లికార్జున్​గౌడ్​తిరిగి వెళ్లి వేదికపై కూర్చున్నారు. అనంతరం కౌన్సిలర్లు కల్యాణి, జయశ్రీ మాట్లాడుతూ.. పట్టణంలోని పోస్టాఫీసు క్వార్టర్స్​విషయంలో ఆ డిపార్ట్ మెంట్ వారు ఇబ్బందులు పెడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులపై కేసులు పెడుతున్నారని సభ దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించిన చైర్మన్​ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, నీటి సరఫరా బంద్ ​చేయాలని అధికారులను ఆదేశించారు. 

రాందాస్​ చౌరస్తాలో మెయిన్​ రోడ్డుపై మిషన్​భగీరథ పైప్​లైన్​లీకేజీ అవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని కౌన్సిలర్​ కృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకురాగా చైర్మన్​ స్పందిస్తూ పనులు చేయలేదని కాంట్రాక్టర్​కు రూ.1.34 కోట్లు ఇవ్వకుండా నిలిపివేశామన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్​ మేఘమాల మాట్లాడుతూ వార్డులో సమస్యల విషయంలో అధికారులకు ఫోన్​ చేస్తే లిఫ్ట్​ చేయడంలేదని మండిపడ్డారు. కౌన్సిలర్​ భీమరి కిశోర్​ ఔరంగాబాద్​లో బుష్​ కటింగ్​ చేయాలని అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని డీఈకి చెప్పినా వినపడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.  పట్టణంలో తైబజార్​ వసూళ్లు యాక్షన్​పెట్టాలని, రైతులు, చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి వసూళ్లు చేయకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఈ మహేశ్, ఏఈ బాలసాయాగౌడ్​, శానిటరీ ఇన్​స్పెక్టర్​, మహేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.