
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోడౌన్ లో బియ్యం గోల్మాల్జరుగుతోంది. సెలవు రోజు ఈ గోడౌన్ నుంచి అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఉదంతం వెలుగుచూసింది. సోమవారం 70 బస్తాల్లో సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని డీసీఎంలో గుట్టుగా తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు డీసీఎంను పట్టుకున్నారు.
సీడబ్ల్యుసీ గోడౌన్ నుంచి డీసీఎం వ్యాన్లో బియ్యం తరలిస్తున్న డ్రైవర్ చందర్, డీసీఎం యజమాని సంతోష్ పై కేసు నమోదు చేసినట్టు టౌన్సీఐ నాగరాజు తెలిపారు. గోడౌన్ నుంచి అక్రమంగా బియ్యం తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి గోడౌన్మేనేజర్తో పాటు, మరో ఇద్దరు సిబ్బందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. కాగా చాలా రోజులుగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోందని తెలిసింది.