- క్వాలిటీ ఎడ్యుకేషన్ తో మెరుగైన ఫలితాలు
- ప్రతి ఏటా 95 శాతం ఉత్తీర్ణత
- స్టూడెంట్స్ కు కాంపిటెటివ్ ఎగ్జామ్ లకు, ఎంప్లాయిమెంట్ చూపే కోర్సుల్లో శిక్షణ
- స్పోర్ట్స్ లో స్టేట్, నేషనల్ లెవెల్ టోర్నీల్లో ప్రతిభ, పతకాల సాధన
- న్యాక్ ఏ గ్రేడ్ హోదా దక్కడంతో యూజీసీ నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చే అవకాశం
మెదక్, వెలుగు: మెదక్ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కమిటీ (న్యాక్) ప్రశంసలు అందుకోవడంతో పాటు రాష్ట్రంలో గురుకుల కాలేజీ స్థాయిలో మొదటిసారి న్యాక్ ఏ గ్రేడ్ సాధించింది. తద్వారా ఈ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడంతోపాటు యూజీసీ నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ మంజూరు కానున్నాయి. మెదక్ పట్టణంలో 2017లో గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం 4 కోర్సుల్లో మొత్తం 275 మంది స్టూడెంట్స్ఇక్కడ చదువుకుంటున్నారు. అనుభవజ్ఞులైన లెక్చరర్లు క్వాలిటీ ఎడ్యుకేషన్అందిస్తుండడంతో పాటు, విద్యేతర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
డిగ్రీ అనంతరం ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, సెల్ప్ఎంప్లాయిమెంట్కు బాటలు వేసేలా ఆయా అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. అంతేగాక స్పోర్ట్స్‌లో స్టూడెంట్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ గురుకుల స్టూడెంట్స్ప్రతి ఏటా 95 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పలువురు స్టూడెంట్స్విదేశాల్లో ఉన్నత చదువులకు సెలెక్ట్అయ్యారు. కొందరు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరికొందరు స్టేట్, నేషనల్లెవల్స్పోర్ట్స్మీట్లలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. నేషనల్సర్వీస్ స్కీంలో సైతం ఈ కాలేజీ స్టూడెంట్స్ఉత్సాహంగా పాల్గొని సామాజిక సేవా భావాన్ని పెంపొందించుకుని భవిష్యత్‌కు మెరుగైన బాటలు వేసుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం 22 గిరిజన గురుకుల కాలేజీలు ఉండగా న్యాక్ఇప్పటి వరకు 7 కాలేజీలను సందర్శించింది. ఆయా కాలేజీల్లో విద్యాబోధన, కాలేజ్నిర్వహణ తీరు, ఇతర అంశాలను పరిశీలించింది. ఈ నెల 5, 6న న్యాక్ బృందం పట్టణంలోని ట్రైబర్వెల్ఫేర్యూత్ ట్రైనింగ్ సెంటర్ లో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించింది. జాతీయ స్థాయి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కాలేజీ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రులతోనూ బృందం సభ్యులు సమావేశమయ్యారు.
కాలేజీలో గిరిజన బాలిక విద్యాభివృద్ధికి అమలవుతున్న కార్యక్రమాలు, స్టూడెంట్స్ప్రగతిని చూసి మంత్రముగ్ధులయ్యారు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో పాటు, విద్యేతర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడాన్ని గుర్తించారు. కాలేజీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రిన్సిపాల్ ఉమాదేవి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా న్యాక్బృందానికి వివరించారు. నిర్దేశిత అన్ని అంశాలపై న్యాక్‌బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గురుకుల కాలేజీ స్థాయిలో రాష్ట్రంలో మొదటి సారిగా మెదక్ గిరిజన మహిళా డిగ్రీ కాలేజ్‌కు 'ఏ' గ్రేడ్ కేటాయించింది.
అందరి సహకారంతోనే సాధించాం
మా కాలేజీకి న్యాక్ 'ఏ' గ్రేడ్ హోదా దక్కడం హర్షణీయం. స్టూడెంట్స్భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు, ఉన్నత చదువులు, ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధికి దోహదపడేలా శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. న్యాక్ ఏ గ్రేడ్ హోదా దక్కడం వల్ల స్టూడెంట్స్అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉమాదేవి, కాలేజీ ప్రిన్సిపాల్