ఎమ్మెల్యే ఎదురుగా తహసీల్దార్‌పై టీఆర్ఎస్ లీడర్ల అవినీతి ఆరోపణలు
రూల్స్‌కు విరుద్ధంగా పోలేదన్న తహసీల్దార్
మెదక్/శివ్వంపేట, వెలుగు: రూల్స్‌కు విరుద్ధంగా ఆర్డర్లు ఇవ్వమని అడిషనల్ కలెక్టర్ నగేష్ సార్ నాపై మస్తు ఒత్తిడి చేసిండు. కానీ నేను అట్లా చేయలేదని శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చంది గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లీడర్, మండల రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ పిట్ల సత్యనారాయణ తహసీల్దార్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. దాంతో తహసీల్దార్ భాను ప్రకాష్ స్పందిస్తూ అడిషనల్ కలెక్టర్నగేష్ మండలంలో ఉన్న కొన్ని భూములకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వాలని ఒత్తిడి చేసినా రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని తాను ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన బినామీ అయిన జీవన్ గౌడ్ కు పాంబండ గ్రామంలో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 142లోని 20 ఎకరాల విస్తీర్ణంలో స్టోన్‌క్రషర్ ఏర్పాటు కోసం పర్మిషన్ ఇవ్వమని అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పారు. భూరికార్డుల నుంచి తొలగించిన పేర్లను మళ్లీ నమోదు చేయమని, వివాదాల్లో ఉన్న భూములకు ఆర్డర్లు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారని అన్నారు. తాను ఆయా భూములకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నానని, రూల్స్‌కు విరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చి ఉంటే తానూ జైలుకు వెళ్లేవాడినని చెప్పారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించే జిల్లాలో భారీఎత్తున అవినీతి జరగడం దురదృష్టకరమన్నారు.
For More News..