ఖేలో ఇండియా పోటీల్లో సత్తా చాటిన మెదక్

ఖేలో ఇండియా పోటీల్లో సత్తా చాటిన మెదక్

మెదక్ (చేగుంట), వెలుగు : ఈ నెల 23, 24న సికింద్రాబాద్ లోని సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా అండర్ 14, అండర్ 18 రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా మూడో స్థానం సాధించినట్టు ఆదివారం కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో వెండి పతకంతోపాటు, రూ.30 వేల నగదు బహుమతి, అండర్ 18 జూనియర్ బాలికల విభాగంలో కాంస్య పతకంతోపాటు, రూ.20 వేల నగదు బహుమతి సాధించారన్నారు.

ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దోసపాటి రాము చేతుల మీదుగా క్రీడాకారులు పతకాలు అందుకున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా నేషనల్ రగ్బీ రెఫరీలు కర్ణం మల్లీశ్వర్​, రితేశ్, మహేశ్ , జిల్లా పీఈటీల ల సంఘం అధ్యక్షుడు నాగరాజు, పీడీలు శారద, మంజుల, నర్సింలు, సంతోశ్ వారిని అభినందించారు.