
భీమదేవరపల్లి, వెలుగు : న్యూఢిల్లీలో జరిగిన మూడో ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన చిన్నారులు ప్రతిభ చూపారు. కిక్‌లైట్, క్రియేటివ్ ఫార్మ్, పాయింట్ ఫైటింగ్, లైట్ కాంటాక్ట్ విభాగాల్లో ములుకనూరు, ముత్తారం, కొత్తకొండ గ్రామాలకు చెందిన ఆవుల సిరిచందన, దొంతిరెడ్డి విభావత్, వాగ్దేవి, కొర్ర సాత్విక్, సాత్విక, సామల వినీష, ఎల్కతుర్తికి చెందిన అమ్రీన్ మెడల్స్ సాధించారు. కోచ్ సిరిగిరి సాంబశివ ఆధ్వర్యంలో చిన్నారులు మెడల్స్ సాధించడం పట్ల కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.