
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లాలో మార్చి31న నిర్వహించిన కిక్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో తమ స్కూల్ పతకాలు సాధించినట్లు కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రావు సోమవారం తెలిపారు. బి.రిత్విక్ (4వ తరగతి) రెండు సిల్వర్, జి.మనోజ్ ఓ గోల్డ్, మరో సిల్వర్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ తిరుపతిరావు, కోచ్ అభినందించారు.