
కరీంనగర్ టౌన్, వెలుగు: ఐఐటీ స్టాండర్డ్ ఎగ్జామ్‌లో సత్తాచాటిన తమ స్కూల్ విద్యార్థులకు మెడల్స్ అందించినట్లు మానేర్ స్కూల్ చైర్మన్ కడారు అనంతరెడ్డి తెలిపారు. శనివారం సిటీలోని మానేర్ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు ఆయన మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వారం కింద హైదరాబాద్ టాపర్స్ ఐఐటీ వారు 6,7,8,9 క్లాసుల విద్యార్థులకు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఐఐటీ స్టాండర్డ్ ఎగ్జామ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆయా ఎగ్జామ్స్ లో సత్తాచాటిన తమ స్కూల్ విద్యార్థులకు నిర్వాహకులు మెడల్స్ అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ కడారు సునీతరెడ్డి, ప్రిన్సిపాల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.