మేదర్ కాలనీ సమస్య తీరేదెన్నడు?

కుభీరు : ప్రతి ఏటా వానాకాలంలో కుభీర్​లోని మేదర్ కాలనీ నీట మునుగుతోంది. ఏండ్ల కాలంతో తాము ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు సైతం ఆ కాలనీ నీటి మునిగింది. ఇండ్లలోని నీరు చేరి నానా అవస్థలు పడ్డారు.

ఏ ఒక్క నాయకుడు కూడా తమ సమస్యను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వరదల సమయంలో ఇండ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కాలనీ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.