మేడారం మూడో రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..

హనుమకొండ జిల్లా: మేడారం మహాజాతరలో భక్తులు ముడుపులుగా చెల్లించిన కానుకల కౌంటింగ్ మూడో రోజు పూర్తయింది. హుండీల  లెక్కింపు 10 రోజులు పడుతుందని భావించారు. అయితే స్పీడుగా కౌంటింగ్ జరుగుతుండటంతో వారం రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మొదటిరోజు కౌంటింగ్ లో కోటి 34 లక్షల ఆదాయం వచ్చింది. రెండో రోజు రెండు కోట్ల 50 లక్షల 62 వేలు, మూడో రోజూ కోటి 31 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు అధికారులు. 
గట్టి బందోబస్తు.. సీసీ కెమెరాల నిఘా నడుమ లెక్కింపు
హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య హుండీ లెక్కింపు జరుగుతోంది. వారం రోజులు పట్టే అవకాశం ఉండడంతో ప్రతిరోజు దాదాపు మూడువందల మంది సిబ్బందితో లెక్కింపు జరుపుతున్నారు. దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ‌ల‌ ప్రతినిధులు లెక్కింపులో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8నుండి సాయంత్రం 6వరకు హుండీ లెక్కింపు జరుగుతోంది. గత మేడారం జాతరకు ఆదాయం రూ.11కోట్లు రాగా ఈసారి అంతకంటే ఎక్కువే రావచ్చొని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. 

మొత్తం హుండీలు  497.... కౌంటింగ్ పూర్తయినవి 249

మూడు రోజుల కౌంటింగ్ పూర్తి.. మూడ్రోజుల మొత్తం ఆదాయం: 5 కోట్ల, 38 లక్షల 59 వేల 100 నగదు రూపంలో ఆదాయం

మొదటి రోజు కౌంటింగ్ : కోటి 34 లక్షల 60 వేలు

రెండో రోజు కౌంటింగ్ : 2 కోట్ల 50 లక్షల 62 వేలు. 

మూడో రోజు  కౌంటింగ్: కోటి 53 లక్షల 37 వేల 100

 

 

ఇవి కూడా చదవండి

సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి

కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌ను