- 4వరోజు ఆదాయం 2 కోట్ల 90 లక్షలు
- మొత్తం హుండీలు 497.... కౌంటింగ్ పూర్తయినవి 383
హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీకి సమర్పించిన నగదు ఆదాయం లెక్కింపు జరుగుతోంది. టిటిడి కళ్యాణ మండపంలో గట్టి నిఘా నడుమ మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ శనివారం హుండీ లెక్కింపు నాల్గవ రోజుకు చేరుకుంది. 4వరోజు ఆదాయం 2 కోట్ల 90 లక్షలు వచ్చింది. మేడారం జాతర సందర్భంగా మొత్తం 497 హుండీలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 383 హుండీల లెక్కింపు పూర్తయింది. రేపు లేదా ఎల్లుండి లోగా హుండీల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన హుండీల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం హుండీలు 497.... కౌంటింగ్ పూర్తయినవి 383
4 రోజుల కౌంటింగ్ పూర్తి.. .. 8 కోట్ల, 28 లక్షల 81 వేల 980 కరెన్సీ రూపంలో ఆదాయం
మొదటి రోజు కౌంటింగ్ : కోటి 34 లక్షల 60 వేలు
రెండో రోజు కౌంటింగ్ : 2 కోట్ల 50 లక్షల 62 వేలు.
మూడో రోజు కౌంటింగ్: కోటి 53 లక్షల 37 వేల 100
నాలుగవ రోజు కౌంటింగ్: 2 కోట్ల 90 లక్షల 22 వేల 880
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
జాతరలొ రికార్డింగ్ డ్యాన్సులు: యువకులపై దాడి.. ఉద్రిక్తత
మూడు డ్రగ్స్ కేసుల్లో 11 మంది అరెస్ట్