మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి.. మొత్తం ఎంత వచ్చిందంటే

హనుమకొండ జిల్లా: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు ఇవాళ ముగిసింది. జాతర సందర్భంగా మొత్తం 497 హుండీలు ఏర్పాటు చేయగా.. భక్తులు సమర్పించిన నగదు, ఆభరణాలు, చీర సారెలను వేరు చేసి లెక్కించేందుకు ఏడు రోజులకుపైగా పట్టింది. వందల మంది సీసీ కెమెరాల నిఘాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య లెక్కింపు చేపట్టారు. శివరాత్రికి ఆరు రోజుల ముందు నుంచి టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. శివరాత్రి సందర్భంగా రెండ్రోజులు విరామం ఇచ్చి తిరిగి చేపట్టిన లెక్కింపు ఇవాళ పూర్తయింది. మొత్తం 497 హుండీల లెక్కింపు చేపట్టగా నగదు రూపంలో మొత్తం 11 కోట్ల 64 లక్షలు 12 వేల 707 రూపాయలు వచ్చింది. అలాగే ఈసారి వచ్చిన చిల్లర నాణేలు  లెక్కించగా రూ.37 లక్షలు వచ్చింది. అలాగే ఆభరణాల విషయానికి  వస్తే బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లిలు, వెండి 53 కేజీల 450 గ్రాములు వచ్చాయి. ఈసారి ఈ - హుండీ ద్వారా 816 మంది భక్తులు మొత్తం మూడు లక్షల నాలుగు వేలు అమ్మవార్లకు సమర్పించారు. 

మొదటి రోజు కౌంటింగ్ : కోటి 34 లక్షల 60 వేలు.

రెండో రోజు కౌంటింగ్ : 2 కోట్ల 50 లక్షల 62 వేలు. 

మూడో రోజు  కౌంటింగ్: కోటి 53 లక్షల 37 వేల 100

నాలుగవ రోజు కౌంటింగ్: 2 కోట్ల 90 లక్షల 22 వేల 880

5వ రోజు కౌంటింగ్: 1 కోటి 50 లక్షల 15 వేలు

6వ రోజు కౌంటింగ్: కోటి 21 లక్షల 67 లక్షల రూపాయలు.

ఈ హుండీ ఆదాయం: 3 లక్షల నాలుగు వేలు (816 మంది భక్తులు సమర్పించిన మొత్తం)

 

 

 

ఇవి కూడా చదవండి

మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్