మేడారం జాతర: లక్మీపూరం నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు

మేడారం జాతర: లక్మీపూరం నుంచి బయల్దేరిన  పగిడిద్దరాజు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. లక్మీపూరం నుండి మేడారం  సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరాడు.  లక్మీపూరం, మొద్దులగూడెంలో గిరిజన సంప్రదాయ పద్దతిలో  గిరిజనులు  స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్త్ మధ్య  పగిడిద్దరాజు శోభయాత్ర కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు మేడారం చేరుకుంటారు. మంగళవారం జంపన్న వాగులో పూజలు కూడా పూర్తి చేశారు. 

కాగా, మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తున్నది. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. బుధవారం నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. భక్తులు బస చేయడానికి సమ్మక్క, సారలమ్మ పేర్లతో సర్కార్ భవన్లు నిర్మించారు. ఇవి కాకుండా హరిత కాకతీయ హోటల్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ ఉన్నాయి. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌‌‌, రెడ్డి గూడెం తదితర ప్రాంతాల్లో కుటుంబంతో సహా భక్తులు బస చేయడానికి ప్రైవేట్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.