తల్లీ వెళ్లొస్తం .. ముగిసిన మేడారం జాతర

  • చిలుకలగుట్ట చేరిన సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ
  • తిరుగుప్రయాణం అయిన భక్తులు

వెలుగు నెట్‌‌వర్క్‌‌ : మేడారంతో పాటు, ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో నాలుగు రోజుల పాటు వైభవంగా సాగిన సమ్మక్క, సారలమ్మ జాతరలు ముగిశాయి. జనంలోకి వచ్చిన అమ్మవార్లు శనివారం తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తం అయింది. చివరి రోజున కూడా మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎత్తు బంగారం, చీరె, సారెను సమర్పించి, కోళ్లు, యాటలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగియడంతో మేడారం పరిసరాలను ఖాళీ అవుతున్నాయి. మళ్లీ రెండేళ్లకు జరిగే జాతరకు మరోసారి వస్తామంటూ భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. 

చింతగట్టు సమ్మక్క జాతర హుండీ లెక్కింపు

స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ మండలం చింతగట్టు సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలను శనివారం లెక్కించారు. మొత్తం 11 హుండీల ద్వారా రూ. 3,96,553ల ఇన్‌‌కం వచ్చినట్లు ఈవో లక్ష్మీ ప్రసన్న, సూపరింటెండెంట్‌‌ వెంకటయ్య, జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ రమేశ్‌‌ చెప్పారు.