మేడారం ఆలయ ప్రధాన పూజారి లక్ష్మణరావు కన్నుమూత

మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది.  మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన  2023 అక్టోబర్  05వ తేదీన ఉదయం  కన్నుమూశారు.  సమ్మక్క సారక్క మహా జాతర సమయంలో చిలుకలగుట్ట నుండి సమ్మక్క వనదేవతను తీసుకువచ్చే ప్రధాన పూజారులలో సిద్ధబోయిన లక్ష్మణరావు ఒకరు. ఆయన మరణ వార్త పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు.  వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మణరావుకు భార్య సనిత, కూతుళ్లు సౌజన్య,సౌమ్య, కుమారుడు నితిన్ ఉన్నారు.