మంత్రులను కలిసిన మేడారం పూజారులు

తాడ్వాయి, వెలుగు : పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులు కలిశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఈవో రాజేంద్ర బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రులను కలిసి సన్మానించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

జాతరకు సంబంధించిన పనులపై రెండు, మూడు రోజల్లో రివ్యూ నిర్వహిస్తామని చెప్పారు. మంత్రులను కలిసిన వారిలో సారలమ్మ పూజారి కాక సారయ్య, పూజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చెంద గోపాలరావు, గోవిందరాజుల పూజారి కాక వెంకటేశ్వర్లు, సమ్మక్క ప్రధాన పూజారి కుక్కల కృష్ణయ్య, పూజారులు సిద్దబోయిన మునీందర్, అరుణ్, కిరణ్, దేవాదాయ శాఖ కార్యదర్శి క్రాంతి కుమార్ ఉన్నారు.