
ఏటూరునాగారం (తాడ్వాయి), వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో డబ్బుల విషయంలో భార్యతో గొడవపడిన ఓ భర్త గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో పొడిచాడు. స్థానికుల కథనం ప్రకారం.. మెడిక సునీల్, శ్యామల దంపతులకు ఇప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. శ్యామల ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. కూలి పనులు చేసుకునే సునిల్కొంతకాలంగా మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడుతున్నాడు.
డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడు. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరగ్గా సహనం కొల్పోయిన సునీల్...శ్యామలను కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న రూ. 30వేల క్యాష్, వెండి ఆభరణాలతో పారిపోయాడు. గమనించిన కటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి శ్యామలను ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. శ్యామల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా, ఐసీడీఎస్ బృందం బాధితురాలి పిల్లలను సఖి సెంటర్కు తరలించింది.