
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు.
అయినా జ్వరం తగ్గకపోవడంతో శనివారం ఉదయం మరోసారి హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టైంలో ఇంట్లోనే చనిపోయాడు. మృతుడికి భార్య నాగమ్మ, కూతురు సాయి ప్రసన్న, కుమారుడు సాయి కుమార్ ఉన్నారు. సమ్మక్క పూజారి ముత్తయ్య మృతి విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.