మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల హుండీ లెక్కింపు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల హుండీని ఆదాయాన్ని లెక్కించారు. గురువారం వనదేవతల ప్రాంగణంలో తాడ్వాయి పోలీసుల బందోబస్తు మధ్య ఎండోమెంట్ అధికారులు, పూజారులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో, 150 మంది లక్ష్మీవెంకటేశ్వర సమితి వాలంటరీల బృందం మహబూబాబాద్ వారు లెక్కించారు.

ఈ సందర్భంగా మేడారం ఎండోమెంట్ ఈవో రాజేంద్ర మాట్లాడారు. వనదేవతల మహా జాతర ముగిసి నాలుగు నెలలు కావస్తున్నందున హుండీని లెక్కించామని,  రూ.42,10,902  హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు.