మేడారం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలి : శరత్

తాడ్వాయి, వెలుగు:   మేడారం సమ్మక్క సారలమ్మ  జాతర  ఏర్పాట్లను   వేగంగా పూర్తిచేయాలని గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్   శరత్  అన్నారు.  గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్  వెంకట నరసింహారెడ్డి,  కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి మంగళవారం  ఆయన మేడారంలో  పర్యటించారు,  అధికారులకు దేవాదాయ శాఖ ఆనవాయితీ ప్రకారం డోలు వాయిద్యాలు నడుమ   స్వాగతం  పలికారు.   దేవతల గద్దెల వద్ద సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క భవనంలో అభివృద్ధి పనుల పై  సమీక్ష   నిర్వహించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

పార్కింగ్  స్థలాల్లో  ఇబ్బందులు తలెత్తకుండా షైన్​ బోర్డులు, ప్లడ్ లైట్లు పెట్టాలని తెలిపారు.    అత్యవసర వైద్యం  కోపం వీలైనంత ఎక్కువ సంఖ్యలో మినీ అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు.   గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేటట్లు సౌకర్యాలు కల్పించాలని అన్నారు.  గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులు వారు సమవర్ధవంతంగా ఉపయోగించాలని చెప్పారు.   కార్యక్రమంలో  ఎస్పీ శబరీష్,  ఐటీడీఏ  పీఓ  అంకిత్,  అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ, సి వేణుగోపాల్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఓఎస్ డి అశోక్ కుమార్, తాడ్వాయి తాసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్   పాల్గొన్నారు.