- తేదీలను ప్రకటించిన పూజారులు
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు శనివారం మేడారం ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యారు.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12 బుధవారం నుంచి 15 శనివారం వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. దేవతలకు మొక్కులు సమర్పించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ ఈవో రాజేంద్రంను కోరారు.