
మేడారంలో ఎటు చూసినా నీళ్లే. ఎటు చూసినా వరదలే. మేడారం జలదిగ్భంధమైంది. భారీ వర్షాలకు, వరదలకు మేడారం నీటమునిగింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలు నీటమునిగాయి. అమ్మవార్ల ఆలయాల్లో మోకాళ్లలోతు నీరు చేరింది.
సమ్మక్క సారలమ్మ ఆలయాలు జలమయమవ్వగా..ఆలయాల బయట దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. దుకాణాలు కూలిపోయాయి. అందులో ఉండే పూజా సామాగ్రి కొట్టుకుపోయాయి. గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న మేడారం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మేడారం.. pic.twitter.com/STY8OI7z5m
— GSREDDY (@GSreddymedia) July 29, 2023