భక్తులతో కిటకిటలాడిన మేడారం

తాడ్వాయి, వెలుగు: మహాజాతర కంటే ముందే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆదివారం ములుగు జిల్లాలోని మేడారం కిక్కిరిసింది. ఉదయం 5 గంటల నుంచే సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

మేడారం చేరుకునే దారులన్నీ వెహికల్స్ తో నిండిపోయాయి. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేశారు. వాగు ఒడ్డు మీద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, జంపన్న గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు.