
ఏటూరునాగారం, వెలుగు: ఎన్నికల కోడ్ ముగిసినందున మేడారం జాతర పనులను ప్రారంభించాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, ఎండోమెంట్ ఆఫీసర్లతో గురువారం ఐటీడీఏ ఆఫీస్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో అంకిత్ మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుందని చెప్పారు. మహా జాతరకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని చెప్పారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వెంటనే టెండర్స్ పిలవాలని ఆదేశించారు.