పటిక బెల్లానికి అడ్డాగా మేదరిపేట

దండేపల్లి, వెలుగు: పటిక బెల్లం విక్రయాలకు మండలంలోని మేదరిపేట సెంటర్ అడ్డాగా మారింది.  వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సెంటర్ లో ఐక్యవ్యాపార సంఘం ఆధ్వర్యంలో జీరో దందా జోరుగా సాగుతోంది.  బెల్లంను వ్యాపారులు అర్ధరాత్రి  ప్రత్యేక  వాహనాల్లో తెప్పించుకుని నాటుసారా, గుడుంబా తయారీదారులకు అమ్ముతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.