మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు చేసింది. 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ మేడ్చల్ ఏఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ విషయంలో మేడ్చల్ ఏఎస్ఐ రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఖాకీల్లో కొందరు ఇలా లంచాలకు మరిగి పోలీసు శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు.
ALSO READ | హైదరాబాద్‌లో MIM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడి
ఏసీబీకి పట్టుబడుతున్నా.. కేసులు నమోదై జైలుకు వెళుతున్నా కొంతమంది పోలీసుల తీరు మారడం లేదు. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం, సెటిల్మెంట్స్చేయడం, పైసలివ్వనిదే పని చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కొంతమంది పోలీస్అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.