లక్ష రూపాయల లంచం.. ఏసీబీ వలలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ అధికారి

లక్ష రూపాయల లంచం.. ఏసీబీ వలలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ అధికారి

ప్రభుత్వ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. సమాజంలో ఉన్నత గౌరవం. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు ఇవి సరిపోవడం లేదు. వచ్చే జీతంలో సంతృప్తిచెందక బల్ల కింద చేతులు చాస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలను వేపుకుతింటూ వేల మొదలు లక్షల వరకూ దండుకుంటున్నారు. చివరకు తమ పాపం పండిన రోజు ఏసీబీ అధికారులకు చిక్కి అబాసుపాలవుతున్నారు. తాజాగా, ఓ ప్రభుత్వ ఉద్యోగి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.  

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం(ఆగష్టు 29) ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ రిజిస్టర్ కో-ఆపరేటివ్ అధికారి బొమ్మల శ్రీనివాసరాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.