- శిక్ష విధించిన మేడ్చల్ జిల్లా కోర్టు
జీడిమెట్ల, వెలుగు : కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మేడ్చల్ జిల్లా కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జీడిమెట్ల సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ లోని చింతల వెంకట్రాంరెడ్డి నగర్‌కు చెందిన సునీల్ కుమార్, సునైనా దంపతులుకు నలుగురు పిల్లలు. 2019 నవంబర్‌లో కొడుకుకి (9) ఫిట్స్ రావడంతో సునీల్ కుమార్, సునైనా దంపతులు బాబును నిలోఫర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.
మిగతా ముగ్గురు పిల్లలను సనత్ నగర్ లోని తన సోదరుడి ఇంట్లో ఉంచిన సునీల్.. మరుసటి రోజు వెళ్లి తన ఇంటికి తీసుకొచ్చాడు. భార్య సునైనా నిలోఫర్ హాస్పిటల్ లోనే బాబు వద్ద ఉండగా.. సునీల్ మిగతా ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉన్నాడు. ఓ రోజు రాత్రి పెద్ద కుమార్తె(12)పై సునీల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాలిక జరిగిన విషయాన్ని ఇంటి పక్కనే ఉండే మహిళకు వెళ్లి చెప్పింది.
ఆమె సాయంతో 2019 నవంబర్ 26న జీడిమెట్ల పీఎస్ లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సునీల్ కుమార్ పై పోక్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి అతడిని రిమాండ్ కు తరలించారు. కేసు విచారణలో భాగంగా సునీల్ కుమార్ కు 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 500 ఫైన్ విధిస్తూ గురువారం మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి వెంకటేశ్తీర్పునిచ్చారు.