మేడ్చల్ జిల్లాలో మూడు నెలల పసికందును అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడిపిల్లలు కావాలని తిరుగుతుండగా పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పనిచేస్తున్న ఆర్ఎంపీని సంప్రదించారు. ఆమె మూడు నెలల చిన్నారిని ర.4.50 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి ముందుగా వారి నుంచి 10 వేలు అడ్వాన్స్ తీసుకుంది.
మరుసటి రోజు పాప కోసం క్లినిక్ కు వస్తానని చెప్పి వెళ్లిపోయారు. స్వచ్ఛంధ సంస్థ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు స్పాట్ కు వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొందరి మహిళలను అరెస్ట్ చేశారు.