
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా.. 108 వాహనంలోనే డెలివరీ అయింది.108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి.. తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో జరిగింది.
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. గర్భిణిని మేడిపల్లి నుంచి ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన రమ నిండుగర్భిణి. పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది సతీష్ అంబులెన్స్‌లో రమను దవాఖానకు తరలిస్తుండగా.. పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను రోడ్డు పక్కన ఆపి ఆమెకు సిబ్బంది డెలవరీ చేశారు. తల్లీ, బిడ్డను కాపాడారు. రమ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, 108 సిబ్బందికి రమ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.