పోలీసులనే పిచ్చోళ్లను చేసింది..MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..

పోలీసులనే పిచ్చోళ్లను చేసింది..MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..

మేడ్చల్ లో మార్చి22న  ఎంఎంటీఎస్ లో యవతిపై అత్యాచారయత్నం ఘటనలో కీలక విషయాలను బయటపెట్టారు రైల్వే పోలీసులు . అసలు యువతిపై ఎలాంటి అత్యాచారం, దాడి జరగలేదని  వెల్లడించారు.  ట్రైన్ లో  రీల్స్ చేస్తుండగా తలకి దెబ్బ తగలగడంతో యువతికి గాయాలయ్యాయని చెప్పారు. 

అసలేం జరిగిందంటే.?.

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ (23) మేడ్చల్‌‌లోని ఉమెన్స్‌‌ హాస్టల్‌‌ లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తున్నది. మార్చి 22న మధ్యాహ్నం మేడ్చల్ ​నుంచి సికింద్రాబాద్​రైల్వే స్టేషన్ ​సమీపంలోని ఓ సెల్​ఫోన్ ​రిపేరింగ్ ​షాపుకు తన మొబైల్​ డిస్​ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్​ రిపేర్​చేయించుకుని సుమారు రాత్రి ఏడున్నరకు ప్లాట్​ఫామ్​ నంబర్​10లో తెల్లాపూర్‌‌-–మేడ్చల్‌‌ ఎంఎంటీఎస్‌‌ రైలెక్కింది. అది మహిళల బోగీ. అప్పడు ఆ బోగీలో సదరు యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్‌‌‌‌‌‌‌‌లో ఆ ఇద్దరూ దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగీలో ఉంది.  ఆమె రైలులోంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్​స్టేషన్​కు అర కిలోమీటర్​దూరంలో  కంకర రాళ్లపై పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. మొఖం, గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు, అంబులెన్స్​కు సమాచారం అందించారు.  రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అపుడు యువతికి  స్పృహ లేదు. గాందీ డాక్టర్లు న్యూరోసర్జరీ ట్రామా(ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) డిపార్ట్​మెంట్​లో డాక్టర్లు, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌సర్జరీ డాక్టర్లు ట్రీట్​మెంట్ ​చేశారు.

అయితే తనపై ఓ 25 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడని యువతి పోలీసులకు చెప్పింది.  చెక్స్ షర్ట్​, షార్ట్ వేసుకుని ఉన్నాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తెచ్చింది. దీంతో నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది  రైల్వే ఎస్పీ చందనా దీప్తి.  రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాయి.

మొత్తం 300 సీసీ కెమెరాలు చెక్ చేసిన రైల్వే పోలీసులు ఎలాంటి క్లూ దొరకకపోవడంతో యువతిని విచారించారు .  రీల్స్ చేస్తుండగా గాయాలయ్యాయని ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతోనే  అత్యాచారం నాటకం ఆడినట్లు  పోలీసులు  ముందు నిజం ఒప్పుకుంది. దీంతో  లీగల్ ఒపీనియన్ తీసుకుని కేస్ క్లోజ్ చేసే యొచనలో ఉన్నట్లు  రైల్వే ఎస్పీ చందనా దీప్తీ తెలిపారు.