
శామీర్‌పేట, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... TS19T3447 నంబర్ గల డీసీఎం కర్నాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా బుధవారం శామీర్‌పేట ఓఆర్‌ఆర్ వద్ద ఎస్‌వోటీ పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. పైన జొన్నల బస్తాలు ఉండగా వాటి కింద నకిలీ పత్తి విత్తనాల బస్తాలు కనిపించాయి.
దీంతో 37.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను, డీసీఎంను స్వాధీనం చేసుకొని, మంచిర్యాల జిల్లా తపలాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ నరేశ్‌ను అరెస్ట్ చేశారు. నకిలీ విత్తనాల ముఠా వెనుక ఎవరు ఉన్నారు ? వీటిని ఎక్కడి నుంచి తరలిస్తున్నారు ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.