అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వ్యక్తులను మేడ్చల్ జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎర్ర చందనం రవాణా చేస్తున్న వాహనాన్ని తనిఖీలు చేసి, పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దాదాపు రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎర్రచందన దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఏలూరు నుండి నాగపూర్కు తరలిస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి.. మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు.