
మేడ్చల్, వెలుగు: వేసవి ప్రారంభంలోనే మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య పెరిగిపోతోందని స్థానిక బాలాజీ నగర్, మర్రి రాజిరెడ్డి, వెంకట్రామయ్య కాలనీల ప్రజలు తెలిపారు. శనివారం మేడ్చల్మున్సిపల్ ఆఫీస్ఎదుట ఆందోళనకు దిగారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నీటి ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేస్తున్నామని వాపోయారు.
మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సమస్యను పరిష్కరించాలని కమిషనర్ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కమిషనర్ స్పందిస్తూ.. మిషన్ భగీరథ నీటి సరఫరా తగ్గడంతో ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమేనన్నారు. సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.