ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరిగిన సీఎం కప్ క్రీడల్లో మండలంలోని మేడేపల్లి కి మార్తి యువవర్షిణి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. హైదరాబాదులోని హాకీంపేట్ మైదానంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్నాయని మేడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి నాగేశ్వరరావు తెలిపారు.
వర్షిణిగతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొన్నట్టు తెలిపారు. మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, మాజీ సర్పంచ్లు సామినేని రమేశ్, కొత్తపల్లి నాగలక్ష్మి, సొసైటీ చైర్మన్ సామినేని వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షిణిని అభినందించారు.