మూసీ నిర్వాసితులకు మేధా పాట్కర్ పరామర్శ

మూసీ నిర్వాసితులకు మేధా పాట్కర్ పరామర్శ

మలక్ పేట, వెలుగు: ప్రముఖ సామాజిక వేత్త మేధా పాట్కర్ సోమవారం ఓల్డ్ మలక్ పేటలోని శంకర్ నగర్​లో మూసీ సుందరీకరణలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను పరామర్శించడానికి వచ్చారు. సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు అక్కడకు చేరుకొని పరామర్శలకు అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అప్పటికే స్థానిక సామాజిక కార్యకర్త బిలాల్ తో కలిసి మూసీ నిర్వాసితుడు ముజాయిద్ కుటుంబాన్ని మేధా పాట్కర్​పరామర్శించారు.