మూడు కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

మూడు కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
  • మంత్రి పొంగులేటికి నివేదిక అందజేసిన మీడియా అకాడమీ చైర్మన్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు మూడు కేటగిరీలుగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని అక్రిడిటేషన్స్ గైడ్ లైన్స్‌‌‌‌పై ఏర్పాటైన​ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రిపోర్ట్‌‌‌‌ను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ హరీశ్​గురువారం సెక్రటేరియెట్‌‌‌‌లో అందజేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ల జారీకి ప్రస్తుత గైడ్ లైన్స్‌‌‌‌ను పరిశీలించి, కొత్త గైడ్ లైన్స్ ఖరారు చేయడానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చైర్మన్‌‌‌‌గా, కమిషనర్ హరీశ్‌‌‌‌ మెంబర్ కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో సమాచార శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కమిటీ పలుమార్లు సమావేశమై, తాజా గైడ్ లైన్స్ రూపొందింది. కాగా, ఈ కమిటీలో ఎమ్మెల్సీ అమీర్ ఆలీ ఖాన్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్, వీ6 న్యూస్ సీఈవో అంకం రవి, హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి, సీనియర్ ఫొటో గ్రాఫర్ నరహరి ఉన్నారు.