మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టుల ఆందోళన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ శివారు జల్‎పల్లిలో ఉన్న ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయ్యాలని డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణమే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు జరల్నిస్టులు. ఇదిలా ఉండగా.. జల్ల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది

మంగవారం (డిసెంబర్ 10) రాత్రి  మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆయన కుమారుడు, హీరో మంచు మనోజ్‎, అతడి భార్య మౌనికను ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కారును ఇంటి బయట గేట్ దగ్గరే  సిబ్బంది ఆపేశారు. కారు దిగిన మనోజ్ దంపతులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది రాకుండా అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు గేట్ వద్ద నిల్చున్న మనోజ్ తనను అడ్డుకున్న సెక్యూరిటీ  సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు లోపలే ఉందని..  తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని మనోజ్ సిబ్బందిని కోరాడు. 

Also Read :- మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేసిన పోలీసులు

అయినప్పటికీ సిబ్బంది ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించకపోవడతో చేసేదేమి లేక బలవంతంగా గేట్లు తోసుకుని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన జరల్నిస్టులపై మోహన్ బాబు దాడికి దిగారు. తీవ్ర కోపాద్రిక్తుడైన ఆయన జర్నలిస్టుల మైకులు, కెమెరాలు లాక్కున్నాడు. మీడియా ప్రతినిధుల చేతిలోని మైకులు, కెమెరాలను లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్ట్‎లకు గాయాలు అయినట్లు సమాచారం. ఈ పరిణమాలతో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.