- రూపొందించిన మలేసియా సైంటిస్టులు
కౌలాలంపూర్: కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు, నర్సులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తున్న డాక్టర్లు మాత్రం తప్పనిసరిగా కరోనా పేషెంట్ల నడుమ తిరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు పేషెంట్ల దగ్గరకు వెళ్లకుండానే సేవలందించేలా ‘మెడిబోట్ ’ రోబోను మలేషియాలోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ వర్సిటీ సైంటిస్టులు తయారు చేశారు. బ్యారెల్ ఆకారంలో ఐదడుగులు ఎత్తు ఉండే ఈ రోబోట్‌లో కెమెరా, స్ర్కీన్ ల ద్వారా డాక్టర్లు.. పేషెంట్లతో మాట్లాడవచ్చని, రిమోట్ ద్వారా పేషెంట్ టెంపరేచర్‌ను కూడా చెక్ చేయవచ్చిన చెప్తున్నారు. అస్పత్రి వార్డుల్లో, ఐసోలేషన్ సెంటర్లలో కరోనా పేషెంట్ల దగ్గరకి వెళ్లకుండానే డాక్టర్లు వారికి సేవలందిచవచ్చంటున్నారు. ఈ రోబోట్‌ను రూపొందించేందుకు3,500 డాలర్లు ఖర్చయిందని, తొలుత వర్సిటీ ఆస్పత్రిలో రోబోట్‌ను పరీక్షించిన తర్వాత మలేసియాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తామని చెప్తున్నారు.