V6 వెలుగు ఎఫెక్ట్..ఆర్ఎంపీలతో డీఎంహెచ్​వో మీటింగ్

V6 వెలుగు ఎఫెక్ట్..ఆర్ఎంపీలతో డీఎంహెచ్​వో మీటింగ్
  • పరిధి దాటితే చర్యలు తప్పవని వార్నింగ్

మంచిర్యాల, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల దందాపై ‘వెలుగు’లో వచ్చిన కథనంపై మెడికల్​ అండ్​హెల్త్​అధికారులు స్పందించారు. ఇన్​చార్జి డీఎంహెచ్​వో డాక్టర్​అనిత శనివారం జిల్లా వైద్యాఆరోగ్యశాఖ ఆఫీస్​లో ఆర్ఎంపీ, పీఎంపీలతో మీటింగ్ ​నిర్వహించారు. రోగులకు ఫస్టెయిడ్​ మాత్రమే చేయాలని, పరిధి దాటి వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

వారు ఎలాంటి వైద్యసేవలందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. క్లినిక్​లకు ‘ప్రథమ చికిత్స కేంద్రం’ అని బోర్డు పెట్టుకోవాలని సూచించారు. పేరుకు ముందు డాక్టర్​అని రాసుకోరాదని, వారి వద్ద ఎలాంటి మందులు ఉండరాదని, బెడ్స్​ వేసి ట్రీట్​మెంట్ ​చేయరాదని హెచ్చరించారు.

నేషనల్​మెడికల్​ కౌన్సిల్​ (ఎన్ఎంసీ), తెలంగాణ స్టేట్​మెడికల్​ కౌన్సిల్​(టీఎస్​ఎంసీ) రూల్స్​కు లోబడి ప్రాక్టీస్​ చేయాలని సూచించారు. ఎవరైనా రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.