
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలోని హాస్పిటల్స్, ల్యాబ్‌లపై మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు శుక్రవారం దాడులు చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ తో పొగలు కమ్ముకుని సేఫ్టీ రూల్స్ పాటించకపోవడంతో పేషెంట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ఆదేశించిడంతో డీఎంహెచ్ వో శిరీష నేతృత్వంలో ఏడు టీమ్‌లు హాస్పిటల్స్, ల్యాబ్‌లపై దాడులు చేశారు. సౌలతులు, సేఫ్టీ ఎక్విప్మెంట్లు, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే తీసుకుంటున్న చర్యలు, ల్యాబ్‌ల్లో ఉన్న టెక్నీషియన్ల నైపుణ్యం.. తనిఖీ చేశారు.
రూల్స్ ప్రకారం లేని 8 హాస్పిటళ్లను సీజ్ చేసి మరో21 హాస్పిటళ్లకు నోటీసులు అందించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుకృత, ప్రోగ్రాం ఆఫీసర్లు బాలాజీ, చైతన్య, హర్షనాయక్, డిప్యూటీ డెమోలు ఫయాజ్ మొయినుద్దీన్, నాగలక్ష్మి, సీహెచ్‌వోలు తదితరులు
పాల్గొన్నారు.