కలెక్టరేట్ ఉద్యోగులకు వైద్య శిబిరం

 కలెక్టరేట్ ఉద్యోగులకు వైద్య శిబిరం

వనపర్తి, వెలుగు:  ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండాలని  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్​ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో షుగర్, బీపీ, టీబీ ఉచిత పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ లో వివిధ డిపార్టుమెంట్ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 182 మంది శిబిరంలో బీపీ, షుగర్  పరీక్షలు  చేయించుకోగా 27 మందికి  డయాబెటిస్ నిర్ధారణ అయినట్టు, పది మందికి బీపీ నిర్ధారణమైనట్లు, టీబీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ రే 113 మందికి చేయగా మూడు  అనుమానిత కేసులు నమోదైనట్లు డీఎంహెచ్​వో  శ్రీనివాసులు తెలిపారు.  కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్​ సాయినాథ్​రెడ్డి, డీపీఆర్​వో  సీతారాం తదితరులు పాల్గొన్నారు.  

త్వరగా గిరిజనభవన్​ పూర్తి చేయాలి

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న గిరిజన భవన్ నిర్మాణంలో నాణ్యత పాటించాలని అడిషనల్​  కలెక్టర్  సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.  మంగళవారం వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో నిర్మిస్తున్న గిరిజన భవన్ ను ఆయన  తనిఖీ చేశారు.  గిరిజన భవన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు  సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ  మల్లయ్య, జిల్లా ఎస్టీ వెల్ఫేర్​ ఆఫీసర్​  సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్  ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.